కొన్నాళ్లుగా వర్క్ ఫ్రొం హోమ్ లో ఉన్న వాళ్ళు ఇక నెమ్మదిగా ఆఫీసులకు వెళ్లక తప్పదు. ఆఫీస్ కు వెళుతూ ఏదో వస్తువులు ముట్టు కుంటూ ఇంటికి వస్తూ ఉంటే తాము వైరస్‌కు క్యారియర్ లు అవుతామేమోనని చాలామందికి భయం. కానీ జీవితం ముందుకు కదలాలి, ఇలాటి భయాందోళనలకు తావు ఇవ్వద్దు అంటున్నారు ఎక్స్పర్ట్స్.ఎలాంటి ఆవేశానికీ లోను కాకుండా భావోద్వేగాలు అదుపులో ఉంచుకోవాలి వైరస్ సోకుతుందనీ ఆందోళన, మనకు రాదనే అతి విశ్వాసం వద్దు. ప్రభుత్వం సూచించిన నియమాలు పాటించాలి సోషల్ మీడియా అతిగా ఫాలో అవ్వద్దు. మనసుకు ఆందోళన కలిగించే వీడియోలు చూడొద్దు. ఆరోగ్య సేతు మొబైల్ యాప్ డౌన్లోడ్ చేసుకుని యాప్ సహాయంతో స్వీయ నిర్ధారణ పరీక్ష చేసుకోవాలి. రక్షణ చర్యలు, భౌతిక దూరం పాటించాలి తరచూ చేతులు కడుక్కుంటూ, శానిటైజ్ చేసుకుంటూ హాయిగా వర్క్ చేసుకోవాలి.
Categories