పరిపూర్ణమైన జీవితం 40 ఏళ్ల వయసు నుంచి ప్రారంభం అవుతుంది అని చెబుతారు ఎక్సపర్ట్స్. శరీరం ఈశాయ నాలో దృఢంగా ఫిట్ గా ఫ్లెక్సిబుల్ గా ఉంటుంది.ఇక అటు తర్వాత కూడా యవ్వనాన్ని తరగనివ్వకుండా కాపాడుకోవాలంటే  ఫిట్ నెస్ ఎక్సర్ సైజ్  లు కొనసాగించాలి. వైద్యుల సిఫార్సు లతో  అవసరమైన వ్యాయామాలు జీవితంలో భాగంగా చేసుకోవాలి. నట్స్, ఆకుపచ్చని కూరగాయలు, పాలు, ధాన్యాలు, చేపలు, మాంసం తినాలి.మంచి వయసులో ఎంతో తీరిక లేని ఉద్యోగ వ్యాపారాల్లో క్షణం తీరికలేకుండా ఉన్నప్పటికీ వాకింగ్  లు జాగింగ్ లకు సమయం కేటాయించారు.శారీరక చురుకుదనం పెరిగే లాగా జీవనశైలి మార్చుకోవాలి.ఈ 40 ఏళ్ళ వయసులో తీసుకున్న జాగ్రత్తలు వార్ధక్యం లో కూడా ఎలాంటి అనారోగ్యాలు దగ్గరికి చేరనివ్వట. చాలినంత నిద్ర, చక్కని వ్యాయామం ఒత్తిడినివ్వని ఆలోచనలతో ప్రతిరోజూ అద్భుతంగా ప్రారంభించాలి.
చేబ్రోలు శ్యామసుందర్ 
9849524134    

Leave a comment