Categories
నాకంటూ ఒక ప్రత్యేకత కావాలనే ఉద్దేశ్యంతోనే మెటర్నిటీ న్యూ బోర్న్ ఫోటోగ్రఫీ ఎంచుకున్నాను అంటారు అమృత సమంత. ఇది సృజనాత్మకత ఉన్న రంగం. పిల్లలకు ఫోటో షూట్ చేయడం అంటే అంత తేలికేమీ కాదు వాళ్లకు సౌకర్యంగా లేకపోతే వాళ్ళ ఫోటోలు అందంగా తీయలేము. 20 రోజుల వయసున్న బేబీ ల ఫోటోలు ఎంతో శ్రమ ఓపికతో తీయాలి పసికందుల ఫోటోలను జ్ఞాపకాలుగా మలచుకునేందుకు వీలుగా మమ్మీ షూట్ ప్రారంభించాను. నా ఆలోచన కొత్తగా ప్రతి తల్లి తండ్రికి చేరువ అయ్యే లా ఉండటం తో ఇక వెనక్కి తిరిగి చూసుకోనవసరం లేకపోయింది. ఇంతవరకూ పది దేశాల్లో 14 వందల మంది పిల్లల కోసం ఫోటో షూట్ చేశాం అంటున్నారు సమంత.