Categories
పోలాండ్ లోని జలిపి అనే గ్రామంలో ఒకప్పుడు 1904లో felieja curylowa అనే ఒకామే ఉంది. ఆమె తన మూడు గదుల ఇంటిని ప్రతి అంగుళం అమిత శ్రద్దగా పువ్వుల్తో అలంకరించింది. ఆవిడ చనిపోయాక ఆమె ఇంటిని మ్యూజియంగా మార్చారట. అప్పటి నుంచి ఈ సంప్రదాయం మొదలైందేమో కాని ఇప్పుడు ఆ జలిపి గ్రామాన్ని అత్యంత సుందరమైన గ్రామంగా గుర్తించారు.గ్రామంలో ఉన్న ప్రతి ఇల్లు లోపల,బయట ఎంతో ఆకర్షణీయంగా అందంగా ఉంటాయి. పైగా ప్రతి సంవత్సరం పోటీలు నిర్వహించి ఎక్కువ అందమైన ఇంటికి బహుమతులు కూడా ఇస్తారట. 1948 నుంచి ఈ పోటీలు నిర్వహిస్తున్నారు. పోలాండ్ లోని పర్యాటకులను ఆకర్షించే ప్రాంతాల్లో ఈ గ్రామం ముందుంది.