సున్నితమైన చర్మానికి కోల్డ్ ప్రెస్ ఆయిల్స్ తగినంత రక్షణ ఇస్తాయి. చర్మం మృదుత్వాన్ని కాపాడుతూ తేమ కోల్పోకుండా సంరక్షించటంలో కోల్డ్ ప్రెస్ ఆయిల్స్ ఉత్తమమైనవి. చల్లని వాతావరణంలో విత్తనాలు,నట్స్ నుంచి తీసే నూనెను కోల్డ్ ప్రెస్ ఆయిల్స్ అంటారు. ఈ నూనెల్లో ట్రాన్స్ ఫ్యాట్స్, ఇతర రసాయనాలు ఉండవు. సహజసిద్ధమైన పోషకాలు యాంటీ ఆక్సిడెంట్లు సువాసనలు పుష్కలంగా ఉండే నూనెలు తక్కువ కాలమే నిలవ ఉంటాయి. క్వాలిటీ ప్రెస్ ప్రాసెస్ లో తయారైన కొబ్బరి నూనె చర్మానికి ఎంతో మేలు చేస్తుంది. మడతలు పోయి చర్మం నునుపుగా మారిపోతుంది.

Leave a comment