Categories
ఇప్పుడు టీనేజర్స్ కుడా అదో ఫ్యాషన్ లా బీర్ తాగుతున్నారు. ఒక పరిశోధన కోసం టీనేజ్ లో బీర్ తాగే అలవాటున్న వాళ్ళని నలభై వేల మందిని సెలక్ట్ చేశారు. దాదాపు 20 ఏళ్ల పాటు సుదీర్ఘమైన పరిశోధన సాగింది. అందరికి మధ్య వయసు వచ్చేసరికి వెయ్యిలో 383 మందికి కాలేయ సమస్యలు వచ్చాయి, కొందరికి 39 ఏళ్లకే కాలేయం చెడిపోయింది. సిరోసిస్ వచ్చిన వారు కాలేయం పని చేయక చనిపోయిన వారు ఎక్కువమంది ఉన్నారు. ఈ అధ్యాయనం ముగిస్తూ ఏర్పాటు చేసిన ఒక సదస్సులో టీనేజ్ లో ఉన్నవారు బీర్ జోలికి పోకపొవటమే ఆరోగ్యం అని చెప్పారు పరిశోధకులు.