పిల్లలు ఎదుగుతూ ఉండటం శ్రద్ధగా గమనిస్తే వాళ్ల నుంచి పెద్ద వాళ్ళు ఎన్నో పాఠాలు నెర్చుకొవచ్చు అంటున్నారు సైకాలజిస్టులు . వాళ్ళు పసితనం నుంచి ఆకలేస్తే ఎడుస్తారు. ఆహారం సరిపోగానే వద్దని తిరస్కరిస్తారు. మనం కుక్కిపెట్టబోతే కక్కుకోని తమ నిరసన చెస్తారు. మనం కూడా ఆకలేస్తే కాలవల్సినంతే తినాలి కదా. అలాగే వాళ్ళు ఆడుకుంటారు, నిద్రోస్తే వెంటనే నిద్రపోతారు. లేస్తూనే మళ్ళీ తిండి, విశ్రాంతి. మరి మనం తినేస్తాం టివీ చూస్తూ కళ్ళు మూసేస్తాం, బద్ధకంగా పడుకొంటాం. పసి వాళ్ళు ప్రతి దాన్ని చూసి సంతోషపడుతారు మనస్ఫూర్తిగా దాన్నీ ఆస్వాదీస్తారు.కానీ మనం దేని పట్ల శ్రద్ధ చూపెట్టం. ఒక వేళ కళ్ళ ముందు అద్భుతం జరిగినా ,ఆశ్చర్యపోయేందుకు కూడా అనుమానపడుతం. పక్క వాళ్ళు దాన్ని పట్టించుకోకపోతే మనం అనవపరంగా పట్టించుకొని వేలాడుతున్నాం అనుకొని నిజంగా మనం పెద్దవుతూ అన్ని మిస్ అవుతాం.

Leave a comment