ఈ వేసవి విసిగిస్తూనే ఉంటుంది. ఎండకు చర్మం నల్లగా కమిలి పోతుంది. పోడిగా అయిపోతుంది , బిరుసుగా అయిపోతుంది. ఇలాంటి ఇబ్బంది నుంచి గట్టెక్కాలంటే చర్మం మెరిసి పోవాలంటే తేనె ,మీగడ కలిపిన ప్యాక్ వేసుకొండి అంటున్నారు ఎక్స్ పర్ట్స్. ఇది ఇంట్లో తయారు చేసుకోవచ్చు రెండు టీ స్ఫూన్స్ తేనె, ఒక టీ స్ఫూన్ పాల మీగడ ,కొద్దిగా శనగపిండి కొన్ని చుక్కల రోజ్ వాటర్ ఒక బౌల్ లో బాగా కలిపి అది పెస్ట్ గా అయ్యాక దాన్ని ముఖానికి పట్టించాలి. ఒక అరగంట ఆరాక వేడి నీటితో కడిగేస్తే చాలు ముఖం నాజుకుగా అయిపోతుంది. పాల మీగడ తేనె నల్లబడిన చర్మాన్ని మెరిసేలా చేస్తాయి.

Leave a comment