ప్రపంచంలోనే అరుదైన గౌరవం దక్కించుకొంది భూదాన్ పోచంపల్లి హైదరాబాదుకు 45 కిలోమీటర్ల దూరంలో ఉన్న పోచంపల్లి వస్త్ర నేత కు ముందు గాజుల,పూసల తయారీకి ప్రసిద్ధి. ఇరవై నంబర్ నూలుతో తేలియా రుమాళ్లు, ఇక్కత్ బ్రాండ్ పట్టు చీరెలు నేస్తూ 1970 నాటికి అంతర్జాతీయ స్థాయిలో గుర్తింపు తెచ్చుకుంది పోచంపల్లి. తాజాగా ఇప్పుడు యునైటెడ్ నేషన్స్ వరల్డ్ టూరిజం ఆర్గనైజేషన్ చే బెస్ట్ టూరిజం విలేజ్ గా గౌరవం దక్కించుకున్నది. డిసెంబర్ 2వ తేదీన స్పెయిన్ రాజధాని మాడ్రిడ్ లో జరిగే 24 వ మహాసభల సమావేశంలో ఈ పురస్కారం అందుకోనున్నది పోచంపల్లి.

Leave a comment