చీరె రంగు కి సరిగ్గా మ్యాచ్ అయ్యే గాజులు బ్యాగ్ లు కోరుకుంటారు అమ్మాయిలు. శారీ మ్యాచింగ్ ఈ కరెక్ట్ గా సరిపోయేలా సిల్క్ దారపు గాజులు ట్రెండ్ వచ్చింది. ఇప్పుడా సిల్క్ గాజులు ఎంబ్రాయిడరీ తో కనిపిస్తున్నాయి. రంగు మాత్రమే కాదు బ్లౌజ్ పైన వేయించుకున్న వర్క్ మ్యాచ్ అయ్యేలా ఎంబ్రాయిడరీ గాజులు తయారు చేస్తున్నారు. క్లాత్ పైన ముందే పూసలు రాళ్లతో ఎంబ్రాయిడరీ చేసి దాన్ని గాజులకు అతికించి ఇస్తున్నారు. బ్లౌజ్ క్లాత్ ఎదురుగా ఉంచుకొని అచ్చం దాని పైన కుట్టిన ఎంబ్రాయిడరీ డిజైన్ చేసి ఇస్తున్న ఈ గాజులు మెరిసే వర్క్ అందాలతో కళ్ళను కట్టిపడేస్తున్నాయి.

Leave a comment