Categories
మంచి ఆరోగ్యానికి నిద్ర ఎంత అవసరమో అలాగే కలలుకనే అంత గాఢనిద్ర మంచిదంటున్నారు నిపుణులు. ఆ సమయంలో మెదడులో రక్త ప్రసరణ ఎక్కువగా ఉంటుందని దీని వల్ల న్యూరాన్ల లో పేరుకొన్న హానికర కలుషితాలు వెలికి వెళ్లిపోతాయని వారు చెబుతున్నారు. మగత నిద్ర,గాఢ నిద్ర మెలుకువ స్థితిలో ఉన్నప్పుడు రక్త ప్రసరణ ఏ విధంగా ఉంటుందన్న విషయం పై విస్తృత పరిశోధనలు నిర్వహించారు. మగత నిద్ర మెలుకువ కు పెద్ద వ్యత్యాసం లేదు కానీ గాఢ నిద్రలో మాత్రం రక్తప్రసరణ వేగం ఎక్కువగా ఉంది.గాఢ నిద్ర పోవడం ఆరోగ్యానికి చాలా అవసరం అంటున్నారు ఎక్సపర్ట్స్.