Categories
మిగిలిపోయిన ఆహార పదార్థాలు ఫ్రిజ్ లో పెట్టి తినబోయే ముందు వేడి చేసుకోవటం చాలామందికి అలవాటు కాని కొన్ని పదార్థాలు వేడి చేస్తే చాలా ప్రమాదం అంటున్నారు ఎక్సపర్ట్స్ . పుట్టగొడుగులు వండగానే వేడిగా ఉండగానే తినేయాలి. ఎక్కువ సమయం నిల్వ చేసిన వేడిచేసిన, వాటిలోని ప్రోటీన్లు విచ్ఛిన్నమై జీర్ణ సంబంధిత సమస్యలు తలెత్తుతాయి. చికెన్ మళ్లీ వేడి చేస్తే వాటిల్లోని మాంసకృత్తులు నశిస్తాయి. గుడ్డు వేడి చేస్తే క్యాన్సర్ కారక ఫ్రీ రాడికల్స్ ఎక్కువగా విడుదల అవుతాయి. ఆకుకూరలు, క్యారెట్లు వేడి చేస్తే వీటిలో ఉండే ఐరన్ నైట్రేట్లు, పోషకాలు హానికరంగా మారతాయి.