వివాహబంధం తో ముడిపడ్డ భార్యాభర్తల స్నేహబంధం కలకాలం అలాగే వుండాలంటే ముందు దాన్ని కాపాడుకొనే ప్రయత్నo ఇరువైపుల నుంచి రావాలి. ఏ చిన్న సమస్యకైనా అవతల వాళ్ళను అర్ధం చేసుకొనే మాట్లాడుకోవాలి. ఇబ్బంది లేనంత వరకు చూసి చూడనట్లు వ్యవహరించడమే మంచిది. భాగస్వామి అంటే ఒకళ్ళకొకళ్ళు స్నేహితులమే. ఒకళ్ళ అభిరుచులు ఒకళ్ళు తెలుసుకోవడం, గౌరవించుకోవడం, ఒకళ్ళనొకళ్ళు నమ్మడం అర్ధం చేసుకోవడం లాంటివి బంధాన్ని ధృడతరం చేస్తాయి. ఒకళ్ళనొకళ్ళు నమ్మటం అర్ధం చేసుకోవడం లాంటివి బంధాన్ని ధృడతరం చేస్తాయి. ఒకళ్ళనొకళ్ళు గౌరవించుకోవాలి. ఇరువైపుల కుటుంబాలను గౌరవించాలి. పెళ్ళికి ముందు ఎలా వున్నారు పెళ్ళయ్యాక కూడా అలాగే ఉండాలి. ఆలోచన, ఆసక్తులు, అభిరుచులు దేన్నీ పోగొట్టుకోవద్దు. ఇద్దరికీ ఎవరికివారికి ప్రైవసీ ఉండాలి. ఈ ప్రపంచంలో లోపాలు లేని వాళ్ళెవరూ వుండరు. పొరపాట్లు జరిగితే అందరి ముందు కించపరచటం, ఎత్తి చూపటం చాలా తప్పు. ఒంటరిగా ఉన్నప్పుడే ఎలాంటి విషయమైనా మాట్లాడుకొని మనసు విప్పి చెప్పుకోవాలి. ప్రేమ ఎప్పుడూ బంధాన్ని ధృడంగా ఉంచుతుంది. క్షమా గుణాన్ని పెంచుతుంది. అందుకే ప్రేమతో మెలిగితే ప్రాబ్లమ్స్ అనేవి ఉండవు.