ఒక నిశ్శబ్దం బద్దలైంది. లైంగిక వేధింపుల గురించి అందరు పెదవి విప్పుతున్నారు తమ ఆవేదన కోపం బలంగా చెపుతున్నారు. మళయాలం తెలుగు,తమిళ్ ,తెలుగు సినిమాల్లో నటిస్తూ ప్రేక్షకుల అభిమానం పొందిన మంజిమా మోహన్ కుడా తన అభిప్రాయం చెప్పింది. ఒంటరిగా ప్రయాణాలు చేస్తావు కాబట్టి జాగ్రత్తగా ఉండమని పెప్పర్ స్ప్రే బ్యాగ్ లో పెట్టుకోమని నా సోదరుడు పోరుతు ఉంటాడు. నేను ఒకప్పుడు దాన్ని కొట్టి పారేశాను. కాని ఈ మధ్య కొన్ని సంఘటనలు చూశాక పెప్పర్ స్ప్రే కంటే శక్తివంతంగా కాపాడగలిగే వస్తువును స్త్రీలు తమ వెంట ఉంచుకోవాలేమో అనిపిస్తుంది అంటుంది మంజిమా మోహన్. నిజమే కాదా ఈ వేధింపులు సెలబ్రిటీస్ , సామన్యులు అంటూ తేడాలు చూసి జరగవు కదా. ఎవరైనా ఎంతటి వాళ్ళాయినా ఆడవాళ్ళే కదా అంది.

Leave a comment