Categories
Gagana

భయపడ్డాను, తేరుకున్నాను

కొందరి గురించి తెలుసుకుంటే ఇంకెంతో మంది ధైర్యంగా జీవించే కాన్ఫిడెన్స్ వచ్చి తీరుతుంది. మమతా మోహన్ దాస్ ఎన్నో మళయాళ చిత్రాలతో పాటు తెలుగు, తమిళ, కన్నడ చిత్రాల్లో నటించింది. నటిగా, నేపధ్య గాయనిగా ఎన్నో అవార్డులు అందుకుంది. కెరీర్ మంచి దశలో ఉన్న సమయంలో ఆమె కాన్సర్ కు గురయింది. ఇప్పటికీ పట్టు వదలని దీక్షతో చికిత్స చేయించుకుంటూ మలయాళంలో నటన కొనసాగిస్తూనే వుంది. తనకున్న వ్యాధి గురించి తెలిసినప్పుడు స్ట్రాంగ్ గా ఉండలేకపోయానన్నది మమతా మోహన్ దాస్. మొదటి సారి చాలా భయపడ్డాను. అందరూ నా సినిమాలు, పనిపాటల గురించే మాట్లాడేవారు, నాకు స్వాంతన లేదు. ఇల్లు, ఆస్పత్రి రొటీన్ కొన్ని నెలల పాటు సాగింది. మా అమ్మానాన్న జీవితంలో అధమ స్థితిలో సైతం జీవించవలసిన అవసరం గురించే మాట్లాడేవారు. నేను ముందుకే చూడాలని నా కుటుంబ సభ్యుల అభిప్రాయం. శారీరకంగా ఓపిక ఎంత వరకూ ఉంటుందో నాకు తెలియదు కానీ మానసికం గా స్థిరంగా వున్నా. మళ్ళీ నటించడం, పాడటం… కెరీర్ ,మొదలు పెట్టాను.నేనో ఫైటర్ లాంటి దాన్ని. ఏది జరిగినా బయటకు రాగలను నా భయాలు పోగొట్టుకున్నా. ఇప్పుడు జీవితం స్వచ్చగా ఉంది అంది మమతా. ఇలాంటి ధైర్య వచనాలు ఉంటె అనారోగ్య భయంతో కుంగి పోయేవాళ్ళకి బోలెడంత స్వాంతన కలగదు.

Leave a comment