బాపూ గారు ఒక బొమ్మ వేసారు. ఒక పిల్లకి వాళ్ళమ్మ గట్టిగా దువ్వి రెండు జడలు వేసింది. ఆ బిగింపుకి పిల్ల కళ్ళు చక్రాల్లా అయిపోతాయి. చూస్తున్నా డాక్టర్, జడ కాస్త వదులుగా వేస్తే అని చెప్పాడు. అలా జుట్టుని గట్టిగా బిగించి కట్టేసినా, గట్టిగా హెయిర్ బ్యాండ్ బిగించి పెట్టినా తలనొప్పి, చెవి పక్కన గుచ్చినట్లు నెప్పి వస్తుంది. కారణం లేకుండా తలనొప్పి వుంటే హెయిర్ బంద్స్ వైపు చూడమంటున్నారు ఎక్స్ పర్ట్స్. గట్టిగా వుండే ప్లాస్టిక్ బ్యాండ్లు, మెటల్ బ్యాండ్లుఎక్కువ అసౌకర్యం కలిగిస్తాయి. క్లాత్ లేదా రబ్బర్ తో చేసిన మెత్తని వాటి వల్ల ప్రాబ్లం వండదు. స్టయిల్ గా ప్రాబ్లం లేకుండా, మృదువైన సిల్క్, షిఫాన్, అతేలికపాటి మైక్రో సుడ్స్ మార్కెట్ లో ఎన్నో రకాలున్నాయి. వాటిని ఎంచుకుంటే నొప్పులు వుండవు, జుట్టు కుడా తెగిపోకుండా వుంటుంది.

Leave a comment