Categories
మూఢాచారాలు దురాచారాలపై పెద్ద పోరాటం చేశారు బిరుబాల రభా. అస్సాంలోని గోల్ పారా జిల్లాలోని తుకురియా అనే గిరిజన గ్రామం ఆమెది. ఆమె కొడుక్కి అనారోగ్యం చేస్తే అది ఒక మంత్రగత్తె పని అని ఇరుగుపొరుగు చెప్పారు.ఎంతో భయపడింది బిరుబాల కానీ అదంత మోసమని తేలిపోయింది. ఆమెకు మంత్రగత్తెల పేరుతో వారికి జరిగే అన్యాయాలపై స్థానిక మహిళలను బృందంగా చేసుకుని ప్రజల్లో అవగాహన తేవటం మొదలుపెట్టింది.ఎన్నో అవమానాలు దౌర్జన్యాలు ఎదుర్కొంది ఈ పోరాటంతో మంత్రగత్తెలన్న పేరుతో మహిళలపై జరుగుతున్న దాడులపై నిషేధించేందుకు ప్రభుత్వం ఒక కఠినమైన చట్టాన్ని తెచ్చింది. ఇంత పెద్ద పోరాటానికి బిరుబాల రభా కు పద్మశ్రీతో సత్కరించింది ప్రభుత్వం.