
పిల్లల నుంచి పెద్దల దాకా ఎంతో ఇష్టంగా బిస్కట్లు కేకులు తింటారు. కానీ ఈ కేకులు బిస్కెట్లు మంచి ఫ్లేవర్ తో ఉండేందుకు గానూ వాడే ట్రాన్స్ ఫాట్ అనే కొన్ని రకాల కొవ్వు పదార్ధాలు మెదడు పనితీరు పైన తీవ్ర ప్రభావాన్ని చుపిస్తాయంటున్నారు పరిశోధకులు. క్రమేపీ జ్ఞాపకశక్తి తగ్గే ప్రమాదం ఉందంటున్నారు. బిస్కట్లు కేకుల్లో పంచదార రంగులు రకరకాల నూనెలు ఇవన్నింటిలో వచ్చే ప్రమాదం కంటే ట్రాన్స్ ఫాట్ వల్లనే సమస్య అంటున్నారు. ఊబకాయం గుండెకి సంబంధించిన సమస్యలు తప్పని సరిగా వస్తాయంటున్నారు. పేరున్న కంపెనీలు తాము తయారు చేసే తినే వస్తువుల్లో ఏవేం వాడతారో తప్పనిసరిగా ప్యాకింగ్ రేపర్ పైన ముద్రిస్తారు. ఈ ట్రాన్స్ ఫాట్ ఎక్కువగా కనిపించదు. కాకపోతే పళ్ళు పాడైపోతాయని జలుబు వస్తుందని తల్లితండ్రులు మొత్తుకున్నా బిస్కట్లు కేకులు మానేసే పిల్లలుండరు. కనక వాళ్ళకి ఇచ్చే మోతాదు మాత్రం తగ్గించండి. ఇంట్లో వండినవి పళ్ళు తినేలా ఎలాగోలా కష్టపడండి అంటున్నారు అధ్యయనాలు.