పాల వంటి శరీర చ్చాయనే అందం అని నేను నమ్మే దాన్ని అలా రంగు తక్కువగా ఉన్నందువల్ల కొన్ని మోడలింగ్ ఎసైమెంట్స్ నా చేతుల్లోంచి జారిపోయాయి నేనెంతో దిగులు పడ్డాను నువ్వు నల్లగా ఉన్నావని ఎవరు మన మొహం మీద అనరు కానీ దాన్ని మనం సెన్స్ చేయగలం ఉత్తరభారతంలో పెరిగిన నేను ఆ రంగు వివక్షకు లోనయ్యాను అంటోంది బాలీవుడ్ నటి చిత్రంగద సింగ్. అలాంటి నిరాశలో ఉన్నప్పుడే మ్యూజిక్ వీడియోలో గుల్జార్ అవకాశం ఇచ్చారు. నా ప్రపంచమే మారిపోయింది తెల్లని చర్మపు రంగు అందరూ కోరుకుంటారు అనే వ్యతిరేక భావన పోయింది. అందం అంటే అసలైన అర్థం నేను కనుక్కున్నాను ప్రతి మనిషిలో ఏదో ఒక ప్రత్యేకత ఉంటుంది దాన్ని కనుక్కుంటే చాలు అదే అందం అంటోంది చిత్రంగడ.