Categories
ఆక్వా మెరైన్ దీన్నే హరిత నీలమణి అంటారు.ఆకుపచ్చ కలగలసిన లేత నీలం రంగు ఆక్వా మెరైన్ రత్నాలను ప్లాటినం తో పొదిగితే ఎంతో అందం పచ్చలు, వజ్రాల మాదిరిగా ఈ రత్నాలు కూడా బైరేల్ ఖనిజం నుంచి దొరుకుతాయి. బ్రిటిష్ రాణి ఎలిజబెత్ కు ఆమె పట్టాభిషేక సందర్భంగా ప్రజలు ప్రభుత్వం ఆక్వా మెరైన్ రత్నాలు పొదిగిన ఆభరణాలు బహూకరించింది. ఇవి పచ్చల కంటే ఖరీదు తక్కువే నాణ్యమైన ఈ రత్నాలను ధరిస్తే కుటుంబ జీవితంలో ప్రశాంతత నెలకొంటుందని ప్రేమికుల మధ్య అనుబంధం చెక్కుచెదరకుండా ఉంటుందని ఒక నమ్మకం. పెండెంట్ లో పొదిగిన ఈ రత్నాలు ఎంతో అందంగా ఫ్యాషన్ గా ఉన్నాయి.నీలి కాంతులు వెదజల్లే రత్న భరణం ఒక్కటైనా ఉండవలసిందే.