బొట్టు పెట్టుకునే ప్రదేశంలో ఒక్కసారి దురద, వాపు, మచ్చలు వస్తాయి. అక్కడ చర్మం పొడిబారడం వల్ల ఇలాంటి సమస్య వస్తుంది. ఆ ప్రదేశంలో మాయిశ్చరైజర్ రాసి మర్దన చేయాలి. ప్రతిరోజు రాత్రివేళ కొబ్బరి లేదా నువ్వుల నూనె రాసుకోవాలి. అలోవెరా జెల్ రాసి మర్దన చేసిన నలుపు, మచ్చలు పోతాయి. బొట్టు బిళ్ళలు గ్లూ గమ్ తక్కువగా ఉండేలా ఎంచుకోవాలి. రాత్రి పడుకునే ముందర వాటిని తీసేసి మాయిశ్చరైజర్ రాసుకుంటే దురదలు వాపులు రాకుండా ఉంటాయి.

Leave a comment