వంటగది టిప్స్ ఎన్ని తెలుసుకొన్న ఇంకొన్ని వస్తూనే ఉంటాయి. వీటితో లాభలు మాత్రమే ఎక్కువ బిస్కెట్స్ చిప్స్ వేరు వేరు డబ్బాలో ఉంచితేనే కరకర లాడతాయి ఒకే చోట ఉంచితే బిస్కెట్స్ లో తేమ చిప్స్ ను మెత్తగా చేస్తాయి. నిమ్మరసం కొన్ని చుక్కలు కావాలంటే కాయ మొత్తం కోయకుండా పెద్ద సూది లేదా దబ్బనం వంటి దానితో గుచ్చి నాలుగైదు చుక్కల నిమ్మరసం తీసుకోవచ్చు పుట్టగొడుగులు పేపర్ టవల్స్ లో పెట్టి ఫ్రిడ్జ్ లో పెట్టుకోవాలి. సూప్ లో ఉప్పు ఎక్కువైతే బంగాళా దుంపలు కానీ ఆపిల్ ముక్కలు కానీ వేయాలి ప్లాస్టిక్ లంచ్ బాక్స్ కడగాలంటే అందులో వాసనలు పూర్తిగా పోవాలంటే ఒక న్యూస్ పేపర్ మడిచి అందులో పెడితే ఎలాంటి వాసనలు మిగలవు.

Leave a comment