సౌదామినీ,  అందరూ ఒకేలాగా చదివి ఒకే డిగ్రీ తీసుకుంటారు. కానీ ఎవరో ఒకళ్ళే వేళల్లో ఒక్కళ్లుగా  నిలబడతారు. ఇది జతకపు  ప్రభావమేనా అన్నావు. జూకర్ బెర్గ్ ఏమంటాడంటే రిస్క్ తీసుకోకపోవటమే మనం చేస్తున్న పెద్ద రిస్క్. కరెక్ట్. రిస్క్ లేనిదే జీవితం లేదు. అంతేకానీ జాతకం కాదు. మనం పాకేదశ  నుంచి ప్రతి దశలో మనకు తెలియకుండానే రిస్క్ తీసుకుంటాం. సైకిల్ తొక్కటం రద్దీగా ఉండే రహదార్లలో  వేగంగా ప్రయాణించటం అన్నీ రిస్క్ కదా. ఒక్క రోజులో సాధించే మహాద్భుతాలు మంత్రదండాలు ఏవీ ఉండవు. ఒక్కో మెట్టు ఎక్కుతూ ముందుకు వెళితేనే శిఖరాగ్రం చేరటం. వేలకోట్ల వ్యాపారం చేస్తున్న వారి పెట్టుబడి వందల్లోనే. ఎన్నిసార్లు వైఫల్యాల పాకుడు కాళ్ళు వాళ్ళని జార్చేసి ఉంటాయి. అయినా మళ్ళీ ప్రయత్నం చేస్తారు. కొందరు ఒక వైఫల్యం తోనే వెనకడుగు వేస్తారు. భిన్నమైన మార్గాన్ని ఎన్నుకోవటం ఏ దశ లోనూ జంకు చూపించకపోవటం కష్టపడిపోతున్నామనే ఆలోచన కాక ఇష్టంతో పనిచేయటం కొత్త ఆలోచనలను నిరంతరం స్వాగతించటం ఓపెన్ మైండ్ తో వినటం ఇవన్నీ విజేతల లక్షణాలు. వీళ్ళే కోట్లలో ఒకళ్ళు. అంతేకానీ జాతకాలు మంత్రాలు దేవుళ్ళ దీవెనలు వుండవు. కష్టపడి సౌదామినీ నువ్వు సాధిస్తావు.

Leave a comment