Categories
ఫజిల్స్ జ్ఞాన సంపదను వృద్ధి చేస్తాయంటారు . ఒక సమస్య ను వెతికేందుకు కొత్త దారుల్ని వేసుకునేందుకు చేసుకొనే ప్రయోగాలు అన్వయాల ,ఊహలు, ప్రయత్నాలు ఇవన్నీ సృజనాత్మకతను పెంచుతాయి అంటారు . ఫజిల్ ను పూర్తిచేసేందుకు మెదడు లోని రెండు పార్శ్యాలు కలసి పనిచేస్తాయి . దీన్నే హాల్ బ్రెయిన్ ఎపెక్ట్ అంటారు . బుర్రకు ఎంతో మంచి ఎక్సర్ సైజ్ . ఫజిల్స్ పరిష్కరించే సందర్భంలో న్యూరో ట్రాన్స్ మీటర్లయిన డోప మైన్ ఉత్పత్తి పెరిగి మెదడులో మిగతా శరీర భాగాల అనుసంధానం బలపడుతుంది . ఫజిల్స్ పూర్తయినప్పుడల్లా డోప్ మైన్ విడుదలై ఓ పాజిటివ్ మూడ్ కలుగజేస్తుంది . ఫజిల్స్ మానసిక స్టిమ్యులేటర్స్ గా పనిచేసి మెంటల్ ఫిట్ నెస్ ను అందిస్తుంది .