Categories
You&Me

బ్రేకప్ లకు కారణం సహజీవనమే.

ఉహ తలియకుండానే ప్రేమలో పడటం, వెంటనే పెళ్ళి, చాలా చిన్న కారణాలకే బ్రేకప్…….. ఇలాంటి కేసులు ప్రపంచం నలుమూలలా నమోదవ్వుతున్నాయి. అన్ని దేశాలకంటే బ్రిటన్ లోనే ఈ బ్రేకప్ లు ఎక్కువని ఇంటర్నేషనల్ గ్రూప్ ఆఫ్ ఆకదమిక్స్ అనే సంస్థ తేల్చి చెప్పింది. వివాహం చేసుకోకుండా సహజీవనం చేసే సంస్కృతీ పెరగడమే ఈ బ్రేకప్ లకు కారణం అంటోంది అధ్యాయినం. బ్రిటన్లో ప్రతి ఐదుగురిలో ముగ్గురు పిల్లలు పెళ్లి చేసుకోకుండా కాపురం చేసే పిల్లలకు జన్మనిస్తున్నారని ఆ పిల్లల్లో 94 శాతం టీన్ ఏజ్ లోకి రాకముందే తమ తల్లిడంద్రులు బ్రేకప్ చెప్పుకోవడం చూడవలసి వస్తుందిట. ఎంతో మంది చిన్నారులు తమ విలువైన బాంధవ్యాలను కోల్పోతున్నారని సంస్థ ఆవేదన వ్యక్తం చేసింది. విద్య, ఆర్ధిక రంగాల్లో మెరుగ్గా వున్న దేశాల్లోనే బ్రేకప్ ల వ యవాహారం విచ్చలవిడిగా పెరిగిపోతుందని సర్వే తేల్చి చెప్పింది.

Leave a comment