Categories
Gagana

బిజినెస్ ఉమెన్ కు డే ఆఫ్ లు ల్లేవ్.

జనతా గ్యారేజ్ తర్వాత ఇప్పుడు విజయ్ తో నటిస్తున్న సినిమా షూటింగ్ ముగించింది నిత్యా మీనన్. ఇప్పుడిక కొంత విశ్రాంతి అనుకోవడం లేదంటుందీమె. ఉద్యోగులకు ఏడాది లో ఇన్ని సెలవులంటూ వుంటాయి. నటీనటులకు సినిమా షెడ్యూల్స్ ను బట్టి కొంత ఫ్రీ టైం వుంటుంది. కానీ తనకు మాత్రం ఫ్రీ టైం దొరకటం లేదంటుంది నిత్య. చెల్లెలు షగోల్ పన్ను తో కలిసి వెడ్డింగ్ ఫ్యాక్టరీ కంపెనీ స్టార్ట్ చేసింది. కాంట్రాక్టు పద్ధతిలో పెళ్లి పనులన్నీ దగ్గరుండి ఈ కంపెనీ చేసిపెడుతుంది. ఇటీవల ఓ పెళ్ళిలో వర్కర్స్ తక్కువైతే తాప్సీ స్వయంగా ఫ్లవర్ డెకరేషన్ వంటి చిన్న చిన్న పనులన్నీ చేసేసిందట. షూటింగ్ గ్యాప్ లో రిలాక్స్ అవ్వాలన్నా కుదరదు. బిజినెస్ ఉమెన్ లైఫ్ లో ఒక్క ఆఫ్ డే కూడా ఉండదని ఆమె వివరించారు. నటిగా ఇప్పటివరకు చేసిన పాత్రలతో సంతృప్తి దక్కలేదు. ఇంకా మరిన్ని ఆసక్తికరమైన పాత్రలు చేయాలి. తర్వాత దర్శకత్వం లో కూడా వేలు పెట్టాలి. అయితే అదంతా ఇప్పుడప్పుడే ఏం కాదు అంటూ చెప్పుకొచ్చింది తాప్సీ. మరి కెరీర్ మంచి దశలో వుంటే కష్టపడి పనిచేయాలి కదా!

Leave a comment