ఈ తరం పెళ్లి సందడి ఫోటో షూట్లు, కేక్ కటింగ్ ల తోనే హడావుడి చేస్తోంది. నిశ్చితార్థానికి రిసెప్షన్ కి కేక్ కట్ చేస్తున్నారు. ఈ వేడుకలను దృష్టిలో పెట్టుకొని కేక్ థీమ్ మార్చేశారు కళాకారులు లూధియానా కి చెందిన బ్రేక్ టౌన్ క్రష్ అనే సంస్థ ఈ మధ్య ఒక అందమైన పెళ్ళికూతురి కేక్ తయారు చేసి ఇన్ స్టా లో పెట్టింది.వధువే వచ్చి కూర్చుందా అన్నంత సహజంగా ఉంది కేక్. పంచదార మార్జిపాన్ లకు జెలటిన్ ని రంగులనీ జోడించి ముత్యాలు రత్నాలు కుందన్ లు వంటివి తయారు చేసి వాటితో నగలు తీర్చిదిద్దారు. చక్కని అందమైన కేక్ చీర కట్టుకొని ముస్తాబైన ఈ కేక్ కోసేందుకు ఎవరికి మానసోప్పాలీ ? ఈ  కేక్ వధువుతో ఫొటో షూట్ మాత్రం అదిరిపోయిందట !

Leave a comment