Categories
భారత దేశంలో 65 సంవత్సరాల వయస్సు దాటితే మహిళల్లో 80శాతం మందికి ఆస్టియో ఫోరోసిస్ తో బాధపగడుతున్నారని ఒక తాజా అధ్యయనం చెపుతుంది. ఢిల్లీ వైద్యులు నిర్వహించిన ఈ అధ్యయనం ప్రకారం 18 నుంచి 50 ఏళ్ళ మధ్య వయసు ఉన్న మహిళలకు రోజుకు వెయ్యి మిల్లీ గ్రాముల కాల్షియం అవసరం అవుతుందనీ, 50 ఏళ్ళు దాటాక 1200 మిల్లీ గ్రాముల కాల్షియం తీసుకోవల్సి ఉంటుందని చెపుతున్నారు. ఆహారంలో ఈ కాల్షియం లభించకపోతే కనీసం మాత్రల రూపంలో అయినా కాల్షియం తీసుకోవాలని అధ్యయనకారులు సూచించారు.