Categories
WhatsApp

కాల్షియం గురించి ఆలోచించండి.

30 ఏళ్ల వయస్సు వచ్చే వరకు శరీరం కాల్షియంను గ్రహించ గలుగుతుంది. ఆ తర్వత ఆ శక్తి తగ్గి ఎముకలలో దాచుకున్న  కాల్షియంను తీసుకోవడం మొదలుపెడుతుంది. ఇరవై ఏళ్ళు వచ్చే   వరకు ఎవరైతే అన్ని రకాల పోషకాహారం తీసుకుంటారు వారిలో ఎముకల బలహీనత రాదు. ఒక వయస్సు తర్వాత కాల్షియం ఉత్పత్తులు తీసుకోవడం మంచిది. ప్రతి రోజు రాత్రి పాలు తాగాలి. పెరుగులోనూ పుష్కలంగా కాల్షియం వుంటుంది. జున్ను ద్వారా కుడా కాల్షియం పొందవచ్చు. మనిషి రోజురోజుకు అవసరమయ్యే కాల్షియం 15 శాతం ఒక కప్పు పెరుగు ద్వారా ఒక గ్లాసు బత్తాయి రసం ద్వారా అందుతుంది. కాయగురల్లో క్యాబేజీ, బెండకాయ, ఆకుకూరలు, సోయాబీన్స్  పొద్దు తిరుగుడు విత్తనాలు కాల్షియం అందిస్తాయి. బాదాం పప్పుల్లోనూ కాల్షియం ఉంటుది. అలాగే కాల్షియం వంట పట్టించే ఆహారం కుడా జత చేయాలి. పండ్లు, కూరగాయలు ద్వారా విటమిన్ సి, కె, మెగ్నీషియమ్, పొటాషియం శరీరానికి అందుతాయి.

Leave a comment