నీహారికా,

ఏం వాకింగ్ లెద్దూ, పొద్దున్నే లేవడం బోర్ అనేసావు. కానీ ఎప్పుడో ఆది కాలం నాడు మనిషి నలుగు కాళ్ళతో నడిచేవారట. వేటలో గెలుపు కోసం, పరుగులో వేగం కోసం, పోరాటం లో పట్టుకోసం, ఎంతో సాదించిన మనిషి, ఇవ్వాలెందుకో, కార్లు, విమానాలు కనిపెట్టుకుని నడవడం నామోషి అనుకుంటున్నాడు. పక్షుల కిలకిలరావాలతో, ఉదయభానుడి లేత కిరణాలు తాకుతుంటే, చెట్టు, చేమ పచ్చగా చుట్టూ కనిపిస్తూవుంటే రోజు ఓ అరగంట నడవడం, జిమ్కి వెళ్ళడం అతి చౌకైన వ్యయామం. ఆరోగ్యాన్ని ప్రేమించే వాల్లెవ్వరూ నడకను వదులుకోరు. హాయి గా సంగీతం, లేక పొతే ఆలోచించుకుంటూ, ఉదయపు ప్రశాంతతని ఆస్వాదిస్తూ నడవడం ఎంత అరోగ్యం. నిజమే నిద్రను జయించడం కష్టమే. మనస్సు చాలా మాయ చేస్తుంది. రేపు వెళదాం అంటుంది, ఇప్పుడెం లేస్తాం వద్దులే అంటుంది. ఎన్నో సాకులు వెతుకుతుంది. కానీ దాని మాట వినక పొతే ఓ అందమైన ఆరోగ్యవంతమైన ప్రపంచం మనకు స్వాగతం పలికేందుకు సిద్దంగా వుంటుంది. సునాయాసంగా నడుస్తున్న మనకు వందేళ్ళకు డోఖాలేదని అర్ధం. నడకను అయువుకు కోలమానంగా తీసుకో వచ్చు అంటున్నాయి పరిశోధనలు. డిప్రెషన్ లాంటి వేదించే సమస్యలు కూడా నడక తో పోతుంది. ఇంకా చురుకుగా వుండండి. ఇంకాస్త నడవండి. మీ బరువు నియంత్రణలో వుంటుంది అంటున్నారు నిపుణులు. మరి లేవడం బద్దకిస్తే ఇంత గొప్ప అనుభవాన్ని ఆరోగ్యాన్ని మిస్ అవ్వమా?

Leave a comment