వేసవి తో పాటు పిల్లల వేసవి సెలవులోస్తాయి. వాళ్ళని ఉత్సాహం కలిగించే వ్యాపకాల కోసం తల్లి దండ్రులు చూస్తారు. సమ్మర్ క్యాంపులుసరే అనుకోండి. ఇక ఇంట్లో వుండే సమయంలో వాళ్ళకి క్రీడలపై ఇష్టం కలిగేలా చూడాలి. సైకిల్ తొక్కనివ్వచ్చు. వారి జీర్ణ క్రియ రేటు మెరుగు పడుతుంది. కంప్యూటర్ కు అత్తుక్కు పోయే ఆటలకు చెక్ పెట్టండి. పిల్లలకు బాట్మెంటెన్ రాకెట్ కొనివ్వాలి. అలాగే తాడాట, బంతి వంటివి ఆరు బయట ఆడుకునే దాగుడు మూతలు, కబడ్డీ వంటివి ఉత్సాహం ఇచ్చే ఆటలు ప్రోత్సహిస్తే ఇవి ఇవి వాళ్ళకి శారీరక బలం, సామాజిక చొరవ రెండూ వస్తాయి. అలాగే చాలా అప్పర్ట్ మెంట్స్ లో ఈత కొలను ఏర్పాటు చేస్తున్నారు. లేదా ఈత గురించి చెక్కని శిక్షకుల దగ్గర శిక్షణ ఇప్పిస్తే ఈ శిక్షణ వల్ల శరీరానికి మెదడుకి మంచి వ్యాయామం లభిస్తుంది. అన్నింటికంటే పిల్లలను, ఏ సమ్మర్ స్కూల్ లో పంపేసి ఈ సెలవుల్లో వాళ్ళతో ఎక్కువ గడిపే వీలు చూసుకోవడం ఎంతో మంచిది.
Categories