పని వేళల్లో తరుచూ మార్పులు చోటు చేసుకొంటూ ఉంటే అనేక ఆరోగ్య సమస్యలు వస్తాయంటున్నారు. ఉద్యోగంలో షిఫ్టులు తప్పవు కానీ వ్యక్తులు అలవాటు పడ్డట్టు అంత వేగంగా శరీరం అలవాటు పడదని వీరు చెబుతున్నారు. దీని వల్ల బాడీ క్లాక్ లో అనేక మార్పులు చోటు చేసుకొంటాయని ఈ కారణంతో షిప్టులలో పని చేసే పురుషులు ఎక్కువ శాతం పక్షవాతం భారీన పడే అవకాశాలు ఉన్నాయంటున్నాయి అధ్యయనాలు. స్త్రీలలో విడుదల అయ్యే ఈస్ట్రోజన్ హార్మోన్ పక్షవాతం భారీ నుంచి స్త్రీలకు రక్షణ ఇస్తుందని చెపుతున్నారు. ఆహార వేళల్లో మార్పులు నిద్రలో అసమానతలు ,ఒత్తిడి ఆందోళన పెంచుతాయి.రక్త పోటులో హెచ్చుతగ్గుదల గుండె జబ్బుల్ని ,పక్షవాతం వంటి వాటికి దారి తీస్తాయంటున్నారు . షిప్టులలో పని చేసే వారు వారం పొడుగునా ఒకే షిప్టులో పని చేసేలా అవకాశాలు ఉంటే అనారోగ్యం భారీనుంచి కాపాడుకోవచ్చు అంటున్నారు.

Leave a comment