మెంతులు అద్భుతమైన సౌందర్య ప్రయోజనాలు అందిస్తాయి. వీటిలో యాంటీ బాక్టీరియల్ యాంటీ ఫంగల్ యాంటీ ఇన్ ఫ్లమేటరీ గుణాలుంటాయి. నియాసిన్ లేదా విటమిన్ బి3 అత్యాధికంగా ఉండి మెంతులు దెబ్బతిన్న చర్మ కణాల్ని మరమ్మత్తు చేయవచ్చు. కొత్త కణాలను ప్రభావ వంతంగా పునర్ నిర్మింపజేయటంలో సహకరిస్తాయి. ఫలితంగా చర్మం మూడతలు పడటం వయస్సు రీత్యా వచ్చే మచ్చలు ఫైన్ లైన్స్ తగ్గుతాయి.ఈ మెంతుల్ని పిండిగా చేసి చక్కని స్క్రబ్ లేదా మాస్క్ గా వాడవచ్చు.క్రమం తప్పకుండా వాడుతూ ఉంటే చర్మం మెరుపులు మెరుస్తుంది. మృతకణాలు పోతాయి బ్లాక్ హెడ్స్ ,జిడ్డుతనం పోతాయి. నీళ్ళలో మెంతులను నాననిచ్చి గుజ్జుగా చేసి శనగపిండి ,పెరుగు కలిపి చర్మం పై రాస్తే నల్లని వలయాలు తగ్గిపోతాయి.

Leave a comment