Categories
మరింత వేగంగా నడిచి ఎక్కువ క్యాలరీలు కరిగించాలంటే కొన్ని చిన్న టిప్స్ ఉపయోగపడతాయి.పాదాల వైపు చూడకుండా 10 నుంచి 20 అడుగుల దూరం ముందు చుడాలి. బుజాలు వెనక్కి వెళ్ళి తిరిగి ముందుకు వచ్చేలా నడవాలి. మరి చెవుల వరకు భుజాన్ని తీసుకుపోవద్దు. చేతులు వదులుగా ఉంచి 90 డిగ్రీలు ఉండేలా చేతులు ముడవాలి. పిడికిల్లు కూడా వదులుగా ఉండాలి. మోచేతులు బాగా వెనక్కి ముందుకు వెళ్ళేలా ఊపాలి.భుజాల ఎముకలు కిందకి అనించినట్లు వెనక్కి వెళ్ళాలి. మెడ దగ్గర నుంచి తల ను కొంచెం 5 డిగ్రీలు మాత్రమే వంచాలి.చక్కగా నిలబడి మడమ క్రింద తగిలేలా కాళ్ళు ముందుకు ఉండాలి.కాళ్ళు వంగకుండా గట్టిగా ముందుకు చాచాలి. కాలి బొటన వేళ్ళు కింద ఆనించి ఉంచాలి.చిన్న అడుగులు వేయడం ద్వారా వేగంగా నడవాలి.