మహిళలు ఉద్యోగ వ్యాపార వాణిజ్య రంగాల్లోనే కాదు సామజిక బాధ్యత విషయంలో కూడా ఒక్కడుగు ముందే ఉన్నారు. టామ్ గిల్ట్ అనే స్వచ్చంద సంస్థ స్థాపించింది మీరా శర్మ. కేన్సర్ బాధిత మహిళల కోసం విగ్గులు తయారు చేసి ఇవ్వాలనుకుంది. చెన్నయ్ కు చెందిన మీరా శర్మ క్రిస్టియన్ కాలేజీ లోని రొటో రాక్ క్లబ్ చైర్ పర్సన్. క్లబ్ తరఫున సేవా కార్యక్రమాల్లో పాల్గొన్నప్పుడు కేన్సర్ వచ్చిన మహిళలు వాడుతున్న సింథటిక్ విగ్గులు చూసింది. అవి ఒక్కోటి 30 వేల ఖరీదు చేస్తాయి. పైగా వాటివల్ల అలర్జీలు కూడా వస్తాయి. వాళ్ళ కోసం అసలైన శిరోజాలతో విగ్గులు తయారు చేసి ఇస్తే బావుందనుకుంది. ముందుగా తన జుట్టే ఒక విగ్గు కోసం కత్తిరించి ఇచ్చింది. ఆమె స్నేహితురాళ్ళు క్లబ్ సభ్యులు ముందుకొచ్చారు. ఒక విగ్గులు తయారుచేసే కంపెనీ తో కలిసి 4500 రూపాయలకే విగ్గు తయారీ చేసి ఇచేలా మాట్లాడుకున్నారు. వీటిని కేన్సర్ ఇన్స్టిట్యూట్ లో చికిత్స పొందుతున్న మహిళలకు ఉచితంగా ఇస్తూ వస్తున్నారు. దాతల నుంచి విరాళాలు వస్తున్నాయి. దేశవ్యాప్తంగా ఈ టామ్ గిల్ట్ ను విస్తరించి కేన్సర్ బాధితులకు విగ్గులు ఇవ్వాలనేది మీరా శర్మ ఆశయం.
Categories