తాహిరా కాస్యప్ హిందీ నటుడు ఆయుష్మాన్ ఖురానా భార్య ఇన్ స్ట్రాగ్రామ్ లో తనకు క్యాన్సర్ మొదటి దశలో ఉందని రొమ్ములోని ఒక ప్రదేశంలో క్యాన్సర్ కణాలు మల్టిఫై అవుతున్నాయని పోస్ట్ చేసింది. అలాగే క్యాన్సర్ బాధితులైన యువతులు ఎలా ధైర్యంగా ఉండాలి కాన్సర్ ను ఎదుర్కొవాలో ఎలా అప్రమత్తంగా ఉండాలో చెప్పుకొచ్చింది. నాకు 35సంవత్సరాలకే రొమ్ము కాన్సర్ ఉందని తేలింది. ముందే తెలుసుకోవటంతో సర్జరీతో రొమ్మును తొలగించి వీపు నుంచి తీసిన కండరంతో పునర్మించుకొన్నాను. ఎవరైన ముందు జాగ్రత్తతో కాన్సర్ పైన అవగాహణ పెంచుకోవచ్చు. రొమ్ము తొలగించాటం అనేది పెద్ద నష్టమే.మనం మన శరీరాలను ప్రేమించుకొంటాము. కానీ ఇలాంటి సంఘటన మన నిజ జీవితంలో వస్తే మానసిక ధైర్యంతో గెలవాలి .చిరునవ్వుతో దేన్నైనా దాటగలగాలి అంటూ చెప్పింది తాహిరా.