ఫ్రూట్ మాస్క్ తో చర్మానికి నునుపు దనం వస్తుంది. చర్మంపై చేరిన మురికిని కూడా ఈ మాస్కులు తొలగిస్తాయి. ముఖ్యంగా అరటిపండు తేనె కలిపిన మాస్క్ చర్మానికి వరం లాంటిదే. అరటి పండు చిన్న ముక్కలు చేసి మిక్సీలో వేసి గుజ్జులా చేయాలి. ఈ గుజ్జులో తేనె వేసి కలపాలి. ఈ అరటి పండు తేనె మాస్క్ వల్ల ముఖం తాజాగా పట్టులా మెరుస్తుంది. ఇది చర్మానికి సహజ సిద్ధమైన మాయిశ్చరైజర్ గా పని చేస్తుంది. అరటి పండు లోని ఏ విటమిన్ చర్మంలో లోపించిన తేమను తిరిగి పొందేలా చేస్తుంది. పొడి బారిన ,కాంతి హీనంగా మారిన చర్మాన్ని యవ్వనవంతంగా చేస్తుంది. మొటిమలు ,నల్ల మచ్చలు పోగోట్టటంలో ఈ మాస్క్ చాలా బాగా ఉపయోగపడుతుంది. తేనె లోని యాంటీ ఆక్సిడెంట్ల వల్ల వయసు మీద పడ్డ లక్షణాలు చర్మం పైన తొందరగా కనబడవు.

Leave a comment