Categories
మైదా తో తయ్యారయ్యే ఏ పదార్ధం లో నైనా బంగాళ దుంపలు, బియ్యంలో కుడా గ్లేసిమిక్ కార్బోహైడ్రేడ్స్ అధికంగా ఉంటాయి. వీటితో తయ్యారయ్యే బ్రెడ్, పాస్తా మొదలైన వన్నీ ఎక్కువ భాగం చక్కర, అత్యధిక స్టాచ్ తో తయ్యారావ్వు తాయి. వీటన్నింటి లోనూ గ్లూకోజ్ స్ధాయిలు ఎక్కువే. బ్లడ్ షుగర్ పెంచేస్తాయి. ఇన్సులిన్ రిలీజ్ చేయగల పాంక్రియాజ్ ను ఉద్దీప్తం చేస్తాయి. ఈ ఆహార పదార్దాలను డైట్ నుంచి తొలగిస్తేనే ఇన్సులిన్ స్ధాయిలు స్ధిరంగా ఉంటాయి. దీని వల్ల ఆరోగ్యం మెరుగుపడుతుంది. కొవ్వు కరిగిపోతుంది. ప్రతి రోజు ఉదయపు బ్రేక్ ఫాస్ట్ లు స్నాక్స్ లో ప్రోటీన్ నిండినపదార్ధాలు ఉండేలా చూసుకోవాలి. ఇవి కండరాలను కాపాడతాయి.