కేరళ లిటరీ మిషన్ ప్రోగ్రామ్ లో కాత్యాయని అమ్మ నాలుగో తరగతి పరీక్షల కోసం పేరు రిజిష్టర్ చేసుకొంది. ఈ విద్యార్థిని వయసు 96 ఏళ్ళు. పదోతరగతి పూర్తి చేయాలని కంకణం కట్టుకొందట. కేరళలోని అళప్పుళ జిల్లా చప్పాడ్ గ్రామ పంచాయితీలోని ముత్తూమ్ ఆమె ఊరు. ఈమె అప్లికేషన్ చూసి అధికారులు మురిసిపోయారు.45 వేలమంది సీనియర్ సిటిజన్స్ లిటరీ మిషన్ పరీక్ష రాశారు. అందులో కాత్యాయని అమ్మ నాలుగవ తరగతికి అర్హత సాధించింది. ఈమెకు మలయాళం ఛానల్ బహుమతిగా ఒక ఇంగ్లీష్ పుస్తకం ఇచ్చారట.ఇప్పుడీ పుస్తకం చదివేస్తోంది బామ్మ చేరబోయే నాలుగోతరగతిలో ఇంగ్లీష్ కూడా ఉంటుంది కదా మరీ .గతంలో కాత్యాయనీ అమ్మ చిన్న కూతురు అమ్మినమ్మ 62 సంవత్సరాల వయస్సులో ఈ లిటరసీ మిషన్ ద్వారా పదవతరగతి పాసైంది. కాత్యాయని అమ్మకు స్ఫూర్తి ఈ చిన్న కూతురే.
Categories