సాధారణంగా మనకి దొరికే ప్యాకేజీ ఫుడ్స్ లో నిల్వ ఉండేందుకుగానూ బెంజో ఎయిడ్స్, సల్ఫయిట్స్ లాంటి నిల్వ రసాయనాలు పరేటెడ్ డ్రింక్స్ లోనూ ,సాస్లు ,బత్తాయి పండు రసంలోనూ ఉపయోగిస్తారు.వీటివల్ల అనారోగ్యాలు తప్పవు. ప్రాసెస్ చేసిన మాంసం తినటం వల్ల దానిలో ఉండే నైట్రేట్స్ క్యాన్సర్ కు కారణం అవుతాయి. కానీ ఆక్సిజన్ ను లేని ఫ్యాకింగ్ తో కొంత నష్టం తక్కువ .ప్రకృతి సహజంగా మనకు లభించే ఆర్గానిక్ ఉత్పత్తులు ఇరవై నుంచి 30రోజుల పాటు సహజంగానే నిల్వుంటాయి. ఇలా నిల్వ చేయటం కోసం ఆక్సిజన్ లేని ఫ్యాకింగ్ సాంకేతికతనూ వాడతారు. ఈ ఆర్గానిక్ ఉత్పత్తులు ఉంటే పాకెట్ లోపల వస్తువు తాజాగా చెడిపోకుండా నిల్వ ఉంటుంది. ఇలా ఏ కొద్ది విషయాల్లో సమస్య కనిపించదు కానీ ప్రాసెస్ చేసిన పదార్థాల్లో రసాయనాల వల్ల ఎప్పటికైనా నష్టమే అందుకే సహాజంగా వండినవే తీసుకోవటం మంచిది అంటున్నారు డాక్టర్స్.

Leave a comment