1922 లో ఎలిస్ స్టెన్ మన్ అనే ఇంజనీర్ ఒక ఇల్లు నిర్మించాడు . మాములు ఇటుకలతో కాదు . వార్తపత్రికలతో ఇల్లు అది పైగా అవన్నీ ఇరుగు పొరుగు వారు విరాళం ఇచ్చారు . ఇప్పుడది పర్యావరణ అనుకూల జీవన శైలికి ఒక స్మారక చిహ్నంగా ఉంది . అమెరికాలోని మాసాచుసెట్స్ దగ్గరలోని ఫిజియన్ హిట్ స్ట్రీట్ లో ఇప్పటికీ ఒక మ్యూజియం లాగా ఆ ఇల్లు ఉంది . వార్తపత్రికలు అల చదివి పారేయకుండా రీ సైక్లిoగ్ చేస్తే ఎన్నో అద్భుతాలు సృషించవచ్చు అనే అతని స్ఫూర్తికి చరిత్రలో స్థానం దక్కింది . ఆ ఇల్లు ఎంత అందంగా ఉంటుంది అంటే కుర్చీలు ,టేబుల్స్ ,పియానోతో సహా అన్ని పేపర్లు వాడి తాయారు చేసినవే . సైన్ మాన్ కాగితపు క్లిప్ ను కూడా కనిపెట్టాడు . వ్యర్దాలు అలా వదిలేసి భూమికి భారం కాకుండా చూసేందుకు ఎంతో మంది పర్యావరణ హితమైన వస్తువులు సృష్టించేందుకు పూనుకొంటున్నారు .

Leave a comment