నిహారిక, పిల్లల పెంపకం కత్తి మీద సాము వంటిదే. నేర్చుకునే వయస్సులో వాళ్లు దేన్నైయినా అనుకరించి అనుసరిస్తారు. అందుకే శ్రద్ధగా ప్రేమానురాగాలు పంచినట్లు మంచి లక్షణాలు ఉండేలా అన్ని నేర్పాలి. వాళ్లు దేనికైనా భయపడుతున్నారో అంటే భయానికి కారణం తెలుసుకొని దాన్ని ఎలా అదికమించవచ్చో చెప్పాలి. ఎ ప్పుడు వాళ్లను ప్రతి పని నువ్వు చేయగలవనే పాజిటివ్ ధృక్పథంతో పెంచాలి. మంచి మంచి సక్సెస్ స్టోరీస్ తో వాళ్ల విజయాలను అపజయాలను ఒకే స్థిరమైన మనస్సుతో ఎలా స్వీకరించవచ్చో నేర్పాలి . వాళ్లకు బయటి ప్రపంచంతో ఎలా నెగ్గుకు రావాలో , మన వెంట తీసుకు పోయి వారికి చూపించాలి.ఇతర పిల్లలతో ఆడుకోనే అవకాశం కల్పించాలి. వాళ్లు స్వతంత్రంగా నిర్ణయాలు తీసుకునేలా ప్రోత్సహించాలి.అలాగే పిల్లల సంతోషం కోసం వాళ్లకు ఇష్టమైన అభిరుచిని ప్రోత్సహించాలి. అది వాళ్లలో మంచి వ్యాపకంగాను జీవితంలో ఉంటుంది. అప్పుడే పిల్లలు చక్కగా ఎదిగినట్లు.
Categories