Categories
వేసవి తాపం తీర్చగలిగే కొబ్బరి నీళ్ళలో ఎన్నో ఇతర ప్రయోజనాలున్నాయి.మొటిమలు మచ్చలు ఉంటే క్లియర్ స్కిన్ కోసం కొబ్బరి నీళ్ళు మొఖం మొత్తం రాయాలి. టోనర్లు మాయిశ్చరైజర్లు ఇచ్చే ఫలితం కొబ్బరి నీరు ఇవ్వగలుగుతుంది. పొటాషీయం లోపం వల్ల కండరాలు పట్టేస్తూ ఉంటాయి. కొబ్బరి నీటిలో పొటాషీయం సమృద్దిగా ఉంటుంది ఈ నీళ్ళు తాగితే కండరాలు క్రాప్స్ పోతాయి. కొబ్బరి నీళ్ళు తాగినా వాటితో జుట్టు కడిగినా సరైన కండీషనర్ లాగే పని చేస్తుంది. వడ దెబ్బతో సమస్యలు వస్తే ఈ నీళ్ళు ఉదరం సర్దుకునేందుకు సహకరించి శరీరం కోల్పోయిన ఎలక్ట్రో లైట్స్ భర్తి చేస్తాయి.