Categories
ప్రతి వంటకానికి ఒక ప్రత్యేక రుచి అందించే అల్లం వంటింట్లో ఉండవలసిన పదార్థాల్లో అతి ముఖ్యమైనది. అల్లం టీ అందరికీ ఇష్టం జలుబుకు అల్లం కషాయం తిరుగులేని మందు. ఇది ఆహారపదార్ధామే కాదు. తిరుగులేని ఔషధం కూడా. అల్లం మన శరీరానికి అవసరమైన పోషకాలను శోషణం చేసుకోవటంలో ఎంతో సహాయకారిగా ఉంటుంది. మనం తినే ఆహరంలో మాంసకృత్తులను సూక్ష్మ రూపంకి మార్చటంలో ఎంతో సహాయం చేస్తుంది.గోరు వెచ్చని నీటిలో ఒక అల్లం ముక్క కలిపి ఆ రసం తాగితే అజీర్తి తగ్గిపోతుంది. కొన్ని చుక్కల అల్లం నూనె నీటిలో వేసుకొని స్నానం చేస్తే కండరాలు నొప్పులు కీళ్ళ నొప్పుల నుంచి ఉపశమనం ఉంటుంది.