మామిడి పండ్లతో పాటు వేసవిలో మాత్రమే దోరుకుతాయి తాటిముంజలు . ఈ చిన్న ముంజల్లో తియ్యని నీరుంటుంది. దాహాం తీర్చీ శరీరానికి చల్లదనం అందించే తాటిముంజల్లో విటమిన్ బి, ఐరన్ ,కాల్షియం ఉంటాయి. ముఖానికి తాటిముంజల గుజ్జు ప్యాక్ లాగా చేసి ఐదు నిమిషాలు ఆగి కడిగేస్తే మొహాం మెరుపుతో ఉంటుంది. నీటిశాతం అధికం. తేలికగా పొట్ట నిండినట్లు అనిపిస్తుంది. జీర్ణక్రియలో మెరుగుపరుస్తాయి ఈ తాటి ముంజలు వడదెబ్బ తగలనివ్వవు. తాటి ముంజల గుజ్జు కాలిన గాయాలకు ,మచ్చలకు పూస్తే ముందులాగా ఉపయోగపడుతుంది. ఈ సీజన్ లో దొరికే ఈ చల్లని తాటి ముంజలు ప్రతి రోజు తిన్న మంచిదే.

Leave a comment