అదిరే ఎండల్లో చమటతో తడిసి ముద్దయ్యే మధ్యాహ్నలలో తలకింద చల్లని దిండు ఉంటే ఎంతో బావుండు, ఎంత ఫ్యాన్ తిరుగుతున్న చమటలు పోసి దిండు తడిసి పోతూ ఉంటుంది. నిద్రరాక చిరాగ్గా ఉంటుంది. అలాటప్పుడు మా కూలింగ్ జెల్ మెమెరీ ఫోన్ పిల్లో వాడుకోమంటున్నారు తయారీ దారులు. ప్రతి అవసరాన్ని అద్భతం చేసుకొంటేనే ఒక చక్కని బిజినెస్ అవుతోంది . ఈ దిండు లోపల ప్రత్యేక పదార్థాలతో చేసిన జెల్ ఉంటుంది. సాధారణంగా ఉష్ణోగ్రత కన్న తక్కువ వేడిలో ఉండే ఈ జెల్ ఫ్యాక్ లో దిండు కు పెడుతారు . ఈ దిండు పైన పడుకొంటే వంటి వేడి ఈ జెల్ గ్రహిస్తూ ఉంటుంది. హాయిగా నిద్రపడుతోంది.