ఎంత మేకప్ చేసుకున్న కళ్ళు అలసినట్లు ఉంటే అస్సలు బావుండవు. కళ్ళ గురించి ఎంతో శ్రద్ధ తీసుకోవాలి. పచ్చి పాలలోముంచిన దూదిని కళ్లపై పెట్టుకుని కళ్ళ చుట్టూ తుడిచేయాలి. దీనివల్ల కనురెప్పలపై మురికిపోయి కళ్ళు తేజోవంతంగా ఉంటాయి. గ్రీన్ టీ లో మెత్తని వస్త్రాన్ని ముంచి కళ్లపై కప్పాలి. పదినిముషాలు ఉంచి తీసేసి తుడిచేస్తే కళ్ళ అలసట పోయి మిలమిలా మెరుస్తాయి . రోజంతా కంప్యూటర్ ముందు కూర్చుని పనిచేసే వాళ్ళు మధ్యమధ్యలో చల్లని నీళ్లతో కళ్ళు కడుక్కుంటూ ఉండాలి. ఈ చల్లని నీళ్ల టోన్ కళ్ళు మొహం అలసట లేకుండా కనిపిస్తాయి. హాయిగా ఎనిమిది గంటల నిద్ర పోవాలి. ఎండలోకి వెళ్ళేటప్పుడు కళ్ళజోడు ధరించాలి . కళ్ళ చుట్టూ చర్మం వదులైనట్లు అనిపిస్తే తెల్ల సొన రాసి ఆరిపోయాక కడిగేస్తే చర్మం బిగుతుగా అయిపోతుంది. ఐస్ క్యూబ్స్ తో ముఖం మర్దనా చేస్తూ కళ్ళ చుట్టూ ఆ కళ్ళ దనం ఉండేలా చూసుకున్నా కళ్ళు చక్కగా తేటగా కనిపిస్తాయి. అలాగే చల్లని కీరా దోస రసంలో కాటన్ ముంచి కళ్లపై పెట్టుకున్నా ఆ చల్లదనానికి కళ్ళు తేటగా కనిపిస్తాయి.
Categories
Soyagam

చల్లని కీరా దోస రసం ట్రై చేయండి

Leave a comment