2017 లో నేపాలీ భాషలో తీసిన ఈ పాహున సినిమా ప్రియాంక చోప్రా నిర్మించారు. జర్మనీ లో జరిగిన ఇంటర్నేషనల్ ఫిలిం ఫెస్టివల్ లో ఈ చిత్రం గురించి ప్రత్యేక ప్రస్తావన ఉంది. పరమత సహనం లేకుండా ద్వేషం దెబ్బ గోడుతూ పెద్ద వాళ్ళు మాట్లాడే మాటలు పిల్లల పైన ఎలాంటి దుష్ప్రభావం చూపెడతయో  ఈ సినిమా చక్కగా చూపెడుతుంది. వాళ్ళ లేత మనసుల్లో పెద్దల నాటే విష బీజాలతో పిల్లలు ఎలాంటి భావ జాలంతో  పెరుగుతారు.ఎంత మానసిక సంఘర్షణ అనుభవిస్తారో, ఎంత నష్ట పోతారో ఈ సినిమా సారాంశం.సిక్కెం అడవుల్లో హిమాలయ పర్వత పారాల్లో ఉండే గ్రామాల్లో కొండలు లోయలు అందమైన ప్రకృతి లో ఈ సినిమా చాలా అందమైనది. పిల్లలు అమాయకులు, వాళ్ళకేం తెలుసు అనుకుంటాం కానీ వాళ్లు దేన్నైనా నేర్చుకుంటారు అర్థం చేసుకుంటారు,ధైర్యంగా ఉంటారు అనిపిస్తుంది ఈ సినిమా చూస్తుంటే నెట్ ఫ్లిక్స్ లో ఇంగ్లీష్  టైటిల్స్ తో ఉంది తప్పక చూడవలసిన సినిమా ఇది.

రవిచంద్ర .సి
7093440630

Leave a comment