Categories

సరైన భోజనం వేళలు పాటించక, డెడ్లైన్ పైన పనిచేస్తూ టెన్సన్ పడుతూ ఉంటే ఆ ఉద్రేకనికి ఎసిడిటీ వచ్చే అవకాశాలు ఎన్నో ఉన్నాయి .ప్రతి అనారోగ్యం మందులతో తగ్గిపోదు. కొన్ని ఆహారపదార్దాలు కొంత ఉపశమనం ఇస్తాయి. అరటిపండ్లులోని అత్యదిక పీచు జీర్ణశక్తిని సీగ్రతరం చేస్తోంది. బాగా పండిన అరటిపండు తినాలి. చల్లని పాలల్లో కాల్షియం ఎక్కువగా ఉండే ఆమ్లాలు ఏర్పడతాయి. కడుపులో మంటను తగ్గించగల శక్తి చల్లని పాలకు ఉంది. ఉదయం నిద్ర లేవగానే రాత్రి ఫ్రిజ్ లో ఉంచిన చల్లని పాలు ఒక అర గ్లాసు తాగే అలవాటు చేసుకుంటే ఎసిడిటీ కంట్రోల్ అవుతుంది. అలాగే జీలకర్ర లో ఉండే జీర్ణం చేసే శక్తి జీవక్రియను మెరుగు పరిచి గ్యాస్ట్రిక్ సమస్య నుంచి కాపాడుతుంది.