ప్రతిదీ కొత్తగా ఉండాలి ఇవ్వాల్టి అమ్మాయిలకు. ప్రతి వేడుకలోను ఎదో ఒక కొత్తదనం తో మెరిసిపోవాలి అనుకొంటారు. ఆలా వచ్చిందే బ్యాగ్ స్ట్రాప్స్ డిజైన్స్. ప్రతి సారీ బ్యాగ్ ను మార్చేయటం కుదరదు కదా. మరి స్ట్రాప్ ను మార్చేస్తే పోలేదా?. లెదర్ లేదా రెక్సిన్ లెదర్ ను పూల ఆకృతుల్లో కత్తిరించి వాటికీ ముత్యాలు పూసలు జత చేసి స్ట్రాప్స్ పైన అతికిస్తారు. అలాగే ముచ్చటైన ఎంబ్రాయిడరీ వర్కులతో పూవులు పక్షులు,జామెట్రికల్ డిజైన్స్ పట్టీల పైకి చేర్చేస్తున్నారు. పట్టి ఇంకా గ్రాండ్ గా ఉండాలంటే అందమైన అక్షరాల వరసలు దానిపైన కుందన్ లు అంటించి,పూసలు,రాళ్ళు లోహం తో చేసిన డ్రాప్స్ ని అతికించి మరింత అందంగా మార్చేస్తున్నారు. మార్కెట్ లో రెడీమేడ్ బ్యాగ్ స్ట్రాప్స్. ఎన్నో డిజైన్ లతో కనిపిస్తున్నాయి.

Leave a comment